విజయ్ బిన్నీ ఎవరో కాదు.. నాగార్జునతో సినిమా తీసిన డైరెక్టర్
on Dec 3, 2024
ఢీ షో 19 వ ఢీ జోడిగా రాబోతోంది. అంటే అన్నీ జోడీస్ ఇక్కడ డాన్స్ చేసి ఆడియన్స్ ని అలరించబోతున్నాయన్నమాట. ఐతే ఈ న్యూ సీజన్ కి జడ్జ్ గా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఎంట్రీ ఇచ్చారు. అది కూడా శేఖర్ మాష్టర్ ప్లేస్ లో. ఐతే విజయ్ బిన్నీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. విజయ్ బిన్నీ ఎవరో కాదు తెలుగులో అక్కినేని నాగార్జునతో కలిసి "నా సామి రంగ" మూవీని డైరెక్ట్ చేసిన డైరెక్టర్. నాగార్జునతో విజయ్ బిన్నీ ఫస్ట్ మూవీ ఇదే. ఐతే కొరియోగ్రాఫర్ కాస్త డైరెక్టర్ గా మారారు. ఇక నాగార్జున కొత్తదనం ఎక్కడ ఉంటె అక్కడ వాళ్ళను ఎంకరేజ్ చేస్తారు కాబట్టి విజయ్ బిన్నీ ని ఎంకరేజ్ చేశారు.
దర్శకుడు కావాలనే ఇండస్ట్రీలోకి వచ్చాడట విజయ్ బిన్నీ. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీ చూసాక కొరియోగ్రాఫర్ కి అన్నీ క్రాఫ్ట్స్ మీదా బాగా గ్రిప్ ఉంటుందని భావించి కొన్నాళ్లు కొరియోగ్రఫీ చేసి తర్వాత డైరెక్టర్ గా మారాడట. ఐతే తనకు మొదటి నుంచి కోరియోగ్రఫీ కన్నా కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటేనే ఇష్టమని చెప్పాడు. కొరియోగ్రఫీ కూడా ఎక్కువ స్టొరీ టెల్లింగ్ లాంటిదే. అలా డైరెక్టర్ మారాలనుకున్నప్పుడు మొదటి సినిమాను నాగార్జున గారితోనే చేయాలని అనుకున్నాక ఆయనకి కథ చెప్పడం అది ఓకే కావడంతో డైరెక్టర్ గా తోలి అడుగు వేసినట్టు చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ బిన్నీ కోరియోగ్రఫీ చేసిన రన్ రాజా రన్, లవర్స్, దిక్కులు చూడకు రామయ్య, సూర్య వెర్సెస్ సూర్య, ఎవడె సుబ్రహ్మణ్యం, కేరింత, సినిమా చూపిస్తా మామ, భలే మంచి రోజు, ప్రేమమ్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, నేను లోకల్, చలో, హలో గురు ప్రేమ కోసమే, జెర్సీ, అర్జున్ సురవరం వంటి మూవీస్ కి కోరియోగ్రఫీ చేసి కొన్ని హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇకపోతే ఇప్పుడు విజయ్ బిన్నీ తన నెక్స్ట్ మూవీని డైరెక్ట్ చేసాడు. సంక్రాంతి బుల్లోడు పేరుతో నాగార్జున అందులో హీరోగా నటిస్తున్నారు.
Also Read